పవన్ కళ్యాణ్ హీరోగా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రూపొందాల్సిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రామ్ తాళ్లూరికి చాలాకాలం క్రితమే డేట్స్ ఇచ్చారు కానీ సరైన దర్శకుడు, సరైన కథ దొరకకపోవడంతో సినిమా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్‌కి కొత్త కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయంగా బిజీగా ఉండడంతో సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదా…
ఓజీ తర్వాత ఇక సినిమాలు ఆపేస్తాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్, నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దిల్ రాజుకైతే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దిల్ రాజు ఇప్పటివరకు డైరెక్టర్‌ని లాక్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్, దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో ఆ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సాలిడ్ సినిమా చేసే దర్శకుడు ఎవరా అని దిల్ రాజు…