పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. నిజానికి ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పుడు సినిమాలను ఆపేస్తారని అనుకున్నారు, అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. అయినప్పటికీ, చివరిగా ఆయన పలు సినిమాలను ఒప్పుకున్న తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Also Read:Mega Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్‌మెంట్ వీడియో వెనుక అసలు కథ ఇదే
నిజానికి ఆయన ఎప్పుడూ డబ్బు గురించి లేదా రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించరు. అయితే, ఇప్పుడు ఆయన పొలిటికల్ షెడ్యూల్ కారణంగా సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు ఇప్పటివరకు ఆగిపోయాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో మొదలైంది, కానీ ఇప్పటివరకు అది పూర్తవుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ సినిమా కోసం ఆయన 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవాల్సి ఉండగా అందులో కొంత తీసుకున్నారు. అలాగే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం 15 కోట్లలో కొంత అడ్వాన్స్ రూపంలో రెండేళ్ల క్రితమే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఏ.ఎం. రత్నం, మైత్రీ నవీన్‌లను విజయవాడకు పిలిపించిన పవన్ కళ్యాణ్, ఇకమీదట ఈ సినిమాల కోసం తనకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారట.
Also Read: Nani: ప్యారడైజ్ సినిమా టీంలో కీలక మార్పు!
సినిమాలు బాగా ఆలస్యమయ్యాయి కాబట్టి, తాను ఇక నిర్మాతల నుంచి ఎలాంటి డబ్బు ఆశించడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా తాను షూటింగ్‌కు సహకరిస్తానని, వెంటనే సినిమాలను పూర్తి చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఓజీ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్‌ను పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తిగా తీసుకున్నారు. హరిహర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతల నుంచి మాత్రం తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ, ఇకమీదట తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడంతో నిర్మాతలు ఆనందించినట్లు తెలుస్తోంది. సినిమా. నిర్మాతల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న ప్రేమ ఈ విధంగా తెలుస్తోందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
