Site icon NTV Telugu

Chiranjeevi: మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!

Anjana

Anjana

సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఇప్పుడు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ రావడంతో ఆయన తల్లి అంజనాదేవికి అనారోగ్యం ఉందని అందుకే హుటాహుటిన ఆయన బయలుదేరి రావాల్సి వచ్చిందంటూ వార్తలు మొదలయ్యాయి. నిజానికి ఎవరికైనా ఒంట్లో బాలేదని వార్త బయటకు వస్తే ముందు ఆ కుటుంబ సభ్యులను కన్ఫర్మ్ చేసుకోవాలి.

Also Read:Anjali Murder : నా కళ్ల ముందే.. తల్లి హత్యపై చిన్న బిడ్డ చెప్పిన నిజాలు

ఆ తర్వాత ట్వీట్ వేయాలి. కానీ ముందుకు ముందు, మేము వేసాం అని చెప్పుకునేందుకు సోషల్ మీడియాలో చాలామంది ఈ విషయాన్ని షేర్ చేసి ఆ తర్వాత వచ్చిన ఖండనని మళ్లీ షేర్ చేస్తున్నారు. అనారోగ్యం అన్నారు అసలు ఏమైంది? పోనీ హాస్పిటల్ కి ఏమైనా తీసుకెళ్లారా? లాంటి విషయాలు కూడా తెలుసుకోకుండా ఇలా షేర్ చేయడం వల్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Mega Anil: నయనతార ‘ఇలాకా’లో మెగాస్టార్?

అయితే సరిగ్గా ఇదే వార్త బయట వైరల్ అవుతున్న సమయంలో అంజనాదేవి వీడియో ఒకటి అత్తమ్మస్ కిచెన్ గురించి ఉపాసన ఒక వీడియో షేర్ చేసింది. తెలుగింటి ఆవకాయ సిద్ధం చేశామని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెబుతూ నిమిషం 16 సెకండ్ల నిడివి ఉన్న వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో రామ్ చరణ్ తో పాటు సురేఖ ఉపాసన కూడా కనిపిస్తున్నారు. ఇకనైనా ఏదైనా అనారోగ్యానికి సంబంధించిన వార్తలు షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.

Exit mobile version