Pawan Kalyan : చివరి దశలో ‘హరి హర వీర మల్లు పార్ట్-1 షూటింగ్
- తుది దశకు చేరుకున్న హరి హర వీర మల్లు షూట్
- గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్న దర్శకుడు జ్యోతి కృష్ణ
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న ఏ.ఎం. రత్నం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 – 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ యుద్ధ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది.
‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Also Read
- Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
- Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
- Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
- Ramya Krishna : తెల్లవారితే పెళ్లి.. కానీ రాత్రి 2 గంటల వరకు షూటింగ్!
తాజావార్తలు
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో