Site icon NTV Telugu

Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు!

Pawan Kalyan,hariharaveeramallu

Pawan Kalyan,hariharaveeramallu

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరకు ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు. వచ్చే నెల 4వ తేదీన విడుదల చేద్దామనుకున్నారు, కానీ అప్పటికి కూడా ఫైనల్ అవుట్‌పుట్ రావడం కష్టమని భావిస్తున్నారు. చివరకు, జులై 25 వ తేదీన సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ALso Read:Vangalapudi Anitha: అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..!

అయితే, ఈ సినిమాకు సుమారు 120 కోట్ల రూపాయలు రాబట్టాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు ఏ.ఎం. రత్నం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సాఫీగా విడుదల కావాలంటే సుమారు 120 కోట్ల రూపాయల క్లియరెన్స్ అవసరం.

ALso Read:Tollywood: ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ చెప్పిన 13 కోట్ల హీరో ఎవరు?

ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు పూర్తయ్యాయి. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసి 120 కోట్ల రాబడితేనే నిర్మాత బయటపడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సినిమా విడుదల తర్వాత మిగతా విషయాలు చర్చిద్దామని చెప్పారు. వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్‌లో ఉండడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version