సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ అభిమానులకు పండగ రోజు. ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, వారంతా దాన్ని ఒక పండగలా జరుపుకుంటూ ఉంటారు. ఒకపక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే, మరోపక్క ఆయన సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, వారికి ఒక రోజు ముందుగానే ఒక పవర్‌ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ సిద్ధమవుతున్నాడు. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్‌గా చెప్పుకొనే హరీష్ శంకర్, గతంలో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా నుంచి మునుపెన్నడూ చూడని ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ని, పుట్టినరోజు కంటే ఒక రోజు ముందుగానే, అంటే రేపు, రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్
ఈ పోస్టర్ అదిరిపోయిందని ఇప్పటికే సినిమా టీం చెబుతోంది. ఒక రోజు ముందుగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఈ ట్రీట్ అందబోతోందన్నమాట. ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, తొలుత తేరి రీమేక్ అని ప్రచారం జరిగింది. అయితే, తర్వాత హరీష్ శంకర్ సినిమా కథ మొత్తాన్ని మార్చేసినట్లు సమాచారం. కాబట్టి, ఇది రీమేక్ సినిమా కాదు, ఒరిజినల్ సినిమా అని చెప్పొచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓజీకి ఇవ్వాలని, తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్‌కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే, అది ఇప్పుడు సినిమా టికెట్లు తెగడానికి యూస్ అవుతుందని, అలాగే తన సినిమా పోస్టర్ కూడా తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. రెండు సినిమాలకు కాంపిటీషన్ లేదని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రెండూ భాగం అవుతాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.