Site icon NTV Telugu

Pawan Kalyan-Anil Ravipudi: పవన్ కల్యాణ్-అనిల్ రావిపూడి కాంబో.. టాలీవుడ్‌లో జోరుగా టాక్?

Pawan Kalyan Anil Ravipudi

Pawan Kalyan Anil Ravipudi

టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన, ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్న పవన్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీకి సైన్ చేశారు. ‘మన శంకరవరప్రసాద్‌ గారు’తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన కొత్త సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు. విక్టరీ వెంకటేష్‌తో ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు పవన్ కల్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో నిజమైతే టాలీవుడ్‌లో మరోసారి భారీ అంచనాలు నెలకొననున్నాయి.

Also Read: Daryl Mitchell: అతడిని టార్గెట్ చేశాం.. అసలు ప్లాన్ చెప్పేసిన డారిల్ మిచెల్!

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం, మాస్ ఎలిమెంట్స్‌కు అనిల్ రావిపూడి పెట్టింది పేరు. అలాంటి దర్శకుడి స్టైల్‌కు పవన్ కల్యాణ్ స్వాగ్, మాస్ ఇమేజ్ జతకలిస్తే.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ దక్కితే.. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ఓ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను చూడొచ్చని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అటు పవన్ అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ కాంబో ఉంటుందో లేదో.

Exit mobile version