ప్రముఖ నటీమణులు రమ్యకృష్ణ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ‘పాకశాల పంతం’. నేడు (డిసెంబర్ 9, 2025) హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ప్రారంభమైంది. కొల్లా ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ ఒరిజినల్స్ ఈ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవంలో చిత్ర యూనిట్ తో పాటు ఈటీవీ విన్ బాపినీడు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కొల్లా నిర్మాతగా వ్యవహరిస్తుండగా కరణ్ తుమ్మకొమ్మ దర్శకత్వ భాద్యతలు నిర్వరిస్తున్నారు.
ఇక ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే క రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్‌తో పాటు ఈ సినిమాలో సంజయ్ స్వరూప్, మహత్ రాఘవేంద్ర, ఎస్.ఎస్. కాంచి, సమీరా భరద్వాజ్, రాజేష్ రాచకొండ, మాయ నెల్లూరి ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘పాకశాల పంతం’ టైటిల్ బట్టి ఈ చిత్రం వంట లేదా ఆహార నేపథ్యం కలిగిన కథాంశంతో, ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య పంతం చుట్టూ తిరిగే ఎమోషనల్ లేదా కామెడీ డ్రామాగా ఉండవచ్చని అంటున్నారు. పోస్టర్ లో కూడా వంట గది బ్యాక్ డ్రాప్ లో క్రియేట్ చేయడం గమనార్హం. రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసి వచ్చే ఏడాది వేసవినాటికి సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.