బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాపతా లేడీస్’. 2001లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘లాపతా లేడీస్’. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు దర్శకురాలు కిరణ్ రావ్. నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
Also Read : Neha Shetty : OG లో రాధికా స్పెషల్ సాంగ్.. యూత్ కి జాగారమే
అమిర్ ఖాన్ నిర్మాతగా అయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాస్ట్ లేడీస్’ ( ఇంగ్లీష్ ప్రేక్షకులకు వీలగా ‘లపాతా లేడీస్’ పేరు మార్చారు). ఈ సినిమా 2025 ఆస్కార్ అవార్డ్స్ కు ఇండియా తరపున అధికారికంగా ఎంపిక కావడంతో నిర్మాత అమిర్ ఖాన్ ఈ సినిమాను మరింతగా ప్రమోట్ చేసాడు. ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కేలా భారీగా ప్రమోట్ చేసాడు. ఇంతా చేసినా కూడా ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ లిస్ట్ లో లాస్ట్ లేడీస్ కు నిరాశ ఎదురైంది. దీంతో ఆస్కర్స్ లో చోటు దక్కించుకుంటుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న లాస్ట్ లేడీస్ టీమ్ తీవ్ర నిరాశకు గురైంది.