Ori Nayano : టాలీవుడ్లో సరికొత్త సెన్సేషన్..కేవలం 25 రోజుల్లోనే సినిమా షూట్ ప్లానింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా టాలీవుడ్లో ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ పూర్తవ్వాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. కానీ, ఎలాంటి రాజీ లేకుండా కేవలం 25 రోజుల్లోనే మొత్తం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే ఫిబ్రవరిలోనే థియేటర్లలోకి దించుతామని ఓ యంగ్ టీమ్ టార్గెట్ పెట్టుకోవడం ఇప్పుడు ఫిలింనగర్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్న ఆ ప్రాజెక్ట్ పేరే ‘ఓరి నాయనో’. ‘ఎవ్రీ లైఫ్ విల్ హావ్ ఓరి.. నాయనో! మోమెంట్’ (Every life will have Ori.. Nayano! Moment) అనే విభిన్నమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా.. ‘మా ఊరి పొలిమేర’ ఫ్రాంచైజీతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ చేసిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్‌పై హైప్ పెంచుతున్నాయి. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, కేవలం 25 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా పక్కా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నామని ఆయన ప్రకటించారు. ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చే ఫిబ్రవరిలోనే సినిమాను రిలీజ్ చేస్తామంటూ ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. తమ ప్రాజెక్ట్‌కు వంశీ నందిపాటి, డా. అనిల్ విశ్వనాథ్ లాంటి సక్సెస్ఫుల్ వ్యక్తుల అండదండలు ఉండటం పట్ల దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి గొప్ప ప్రయాణం విశ్వాసంతోనే మొదలవుతుందని, ప్రేక్షకులకు కావాల్సిన వినోదంతో పాటు ఎమోషనల్ మూమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని డైరెక్టర్ మణి తేజ ధీమా వ్యక్తం చేశారు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, సత్యకృష్ణ, శ్రీనివాస్ గవి రెడ్డి లాంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. టాలీవుడ్ టాప్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్‌ను, సుభాష్ నాథన్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. కంటెంట్ మీద ఉన్న బలమైన నమ్మకంతో 25 రోజుల టార్గెట్‌గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఓరి నాయనో’ టీమ్, రేపు బాక్సాఫీస్ వద్ద కూడా అనుకున్నట్లే సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం!
Also Read
తాజావార్తలు
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!