North – South calculations: గత సంవత్సరం ఓ సర్వేలో ఆల్ ఇండియాలో టాప్ హీరోస్ ఎవరు అన్నదానిపై సర్వే సాగింది. అందులో తమిళ స్టార్ హీరో విజయ్ నంబర్ వన్ స్థానం ఆక్రమించుకోగా, రెండో స్థానంలో జూనియర్ యన్టీఆర్, మూడో స్థానంలో ప్రభాస్, నాలుగులో అల్లు అర్జున్ నిలిచారు. ఆ తరువాత ఐదో స్థానంతో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ తరువాతి స్థానాల్లోనూ వరుసగా దక్షిణాది కథానాయకులు అజిత్ కుమార్, యశ్, రామ్ చరణ్, సూర్య, మహేశ్ బాబు నిలిచారు. ఇప్పుడు మళ్ళీ ఇదే జాబితాను ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక వెలుగులోకి తీసుకు వచ్చింది. మొన్నటి దాకా సౌత్ మూవీస్ దెబ్బకు కుదేలయిన బాలీవుడ్ బాబులు ఇప్పుడిప్పుడే షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ గ్రాండ్ సక్సెస్ తో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వేయి కోట్ల క్లబ్’లో బాలీవుడ్ హీరోలదే పైచేయి అంటూ ఓ జాబితా జనంముందుకు వచ్చి హల్ చల్ చేస్తోంది.
Read also: Health tips: ఉల్లి కాడలు ఆహారంలో చేర్చుకుంటే ఇన్ని లాభాలా! నిజమెంత?
అందులో మన సౌత్ హీరోలకూ చోటిచ్చారు అనుకోండి! అయితే తమదే పైచేయి అన్నట్టుగా బాలీవుడ్ బాబులు ఆనందిస్తున్నారు. ఇంతకూ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సౌత్ స్టార్స్ ఎవరంటే ‘ట్రిపుల్ ఆర్’తో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్! కాగా, ‘ట్రిపుల్ ఆర్’ చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ కూడా ఈ జాబితాలో నిలిచారు. ఇక కన్నడ స్టార్ యశ్ కూడా తన ‘కేజీఎఫ్-చాప్టర్’తో వేయి కోట్ల క్లబ్ లో స్థానం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రంతో వేయి కోట్ల మైలురాయి దాటబోతున్నాడని ఈ ప్రకటన టముకు వేస్తోంది. అంతకు ముందు ఈ ఫీట్ ను చూసిన వారిలో ఆమిర్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన నటించిన ‘ధంగల్’ ఏకంగా రూ.2,200 కోట్లు పోగేసినట్టు చెబుతున్నారు. ‘బాహుబలి-2’ స్థాయిలో ఈ సినిమా మన దేశంలోనే వసూళ్ళు రాబట్టలేదు. అయితే తమ ‘దంగల్’ విదేశాల్లోనే ఎక్కువగా వసూళ్ళు చూసిందని చాటింపు వేస్తున్నారు.
Read also: Hema Malini-Dharmendra: హేమమాలిని- ధర్మేంద్రకు తెలిసిన కిటుకు ఏమిటి?
అదీగాక, చైనాలో ‘దంగల్’ అక్కడి మండేరియన్ మూవీస్ నే మట్టి కరిపించిందనీ వీరి వాదన! మరి, ‘దంగల్’ తరువాత చైనాలో ‘బాహుబలి-2’ కూడా సందడి చేసింది. ఆ లెక్కలు కలుపుకుంటే, ‘దంగల్’ కంటే ‘బాహుబలి-2’దే పైచేయి కావాలి. తమ లెక్కలే సబబైనవని బాలీవుడ్ బాబుల ఆనందం. ఆమిర్ ‘సీక్రెట్ సూర్ స్టార్’ కూడా దాదాపు వేయి కోట్లు పోగేసిందని వారి వాదన! ఈ ‘వేయి కోట్ల క్లబ్’లో వీరు మాత్రమే ఉండగా, 500 కోట్ల క్లబ్ కూడా తెరిచారు. అందులో ఆమిర్ కు 4 సినిమాలు (పీకే, ధూమ్-3 తో కలిపి), సల్మాన్ కు మూడు – ‘బజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై’, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, రణబీర్ కపూర్ ‘సంజూ’, రణవీర్ సింగ్ ‘పద్మావత్’ ఉన్నాయి. పైన ఉన్న మన హీరోలందరితో పాటు రజనీకాంత్ కు ‘రోబో’ 2.0′ ఇందులో చోటు దక్కేలా చేసింది. ఎంతయినా, మొన్నటి దాకా ఇండియన్ మూవీ అంటే హిందీ సినిమాయే అన్న రీతిలో సాగిన బాలీవుడ్ బాబులు ఇప్పుడు మన స్టార్స్ నీ కలుపుకుపోతున్నారు. తప్పదు మరి!
Hema Malini-Dharmendra: హేమమాలిని- ధర్మేంద్రకు తెలిసిన కిటుకు ఏమిటి?
