దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. నిన్నటి నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తామని యూనిట్ చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. థియేటర్‌కు ఒకరు చొప్పున 50 థియేటర్ల నుంచి 50 మంది విజేతలను ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది.
Also Read:Ayesha Meera Murder Case: ఆయేషా మీరా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. సీబీఎన్‌కు ఆమె తల్లి విజ్ఞప్తి..
మీడియా ప్రతినిధులకు వేసిన షోతో పాటు మిగతా థియేటర్లలో విజేతలకు డబ్బులు అందజేసింది. ఇక ఈ ‘ఒక పథకం ప్రకారం’ జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో సాయిరామ్ శంకర్ చక్కటి కమ్ బ్యాక్ ఇచ్చారని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. ‘ఒక పథకం ప్రకారం’లో సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద అతని మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది సినిమా.