పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘OG’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చివరికి అభిమానులకు నిరాశనే మిగిల్చింది. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా, ఓపెన్ ఆడిటోరియంలో ఈవెంట్ నిర్వహించడంపై ప్లానింగ్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘OG’ లాంటి భారీ సినిమాకు ప్లానింగ్ లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. శిల్పకళావేదిక లాంటి ఇండోర్ వేదికలు అందుబాటులో ఉన్నా, చివరి నిమిషంలో ఓపెన్ ప్లేస్‌కి మార్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం కారణంగా ఈవెంట్ సజావుగా సాగకపోవడంతో, నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి.
Also Read : OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?
దానికి తోడు ఈవెంట్‌కు ట్రైలర్ సిద్ధంగా లేకపోవడం అభిమానులను మరింత నిరుత్సాహానికి గురిచేసింది. టెక్నికల్ సమస్యల వల్ల, ముఖ్యంగా డీఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) ఆలస్యం కారణంగా ట్రైలర్ రిలీజ్ కాలేదని చిత్రబృందం ప్రకటించినా, ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో బాగా నిరాశ చెందారు. అయితే, ఈవెంట్ మొత్తంలో పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన ప్రవర్తన అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. వర్షంలో తడుస్తూ కూడా ‘OG’ గెటప్‌లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం, అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడడం, స్టేజీపై సందడిగా తిరగడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈవెంట్ లోపాలు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉత్సాహపరిచేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసలు అందుకున్నాయి. మొత్తానికి, ‘OG’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ లోపాలు, ట్రైలర్ ఆలస్యం వంటి అంశాలతో అభిమానుల్ని నిరాశపరిచింది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్, ఆయన ప్రెజెన్స్ కారణంగా ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో