Site icon NTV Telugu

Pawan Kalyan’s OG : ఓజీ సినిమాకి కొత్త తలనొప్పి?

Og

Og

అసలే ఇబ్బందులు పడుతున్న ఓజి సినిమా టీమ్‌కి మరో షాక్ తగిలింది. ఎంతో కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఓజి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనారోగ్యం వల్ల ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు.

Also Read:Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల

వెంటనే అన్ని టెస్టులు చేయగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతానికి గోరేగావ్‌లో ఉన్న ఆరే కాలనీలో ఓజి సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆయన కానీ, ఆయన టీమ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇక ఈ సినిమా ఆయనకు మొట్టమొదటి టాలీవుడ్ సినిమాగా నిలవబోతోంది. పవన్ కళ్యాణ్ పక్కన ఆయన పాత్ర ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో, ఆయన ఇలా డెంగ్యూ బారిన పడడం గమనార్హం.

Also Read:Nara Lokesh: పార్టీని లేకుండా చేస్తామన్నారు.. వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు..

అయితే ఇప్పటికే అనేక రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న షూటింగ్, ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వీలైనంత త్వరగా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. కాకపోతే, అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోతే వాయిదా వేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

Exit mobile version