O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లోకి మరో సినీ వారసుడు అడుగుపెడుతున్నాడు. సీనియర్ నటుడు, విప్లవ చిత్రాల కథానాయకుడు దివంగత మాదాల రంగారావు మనవడు, నటుడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. శ్రీకరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకర్ కృష్ణ స్వయంగా రచన, దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో మౌనిక వీర్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వేడుకలో దర్శకనిర్మాత శ్రీకర్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. “మేమంతా కొత్తవాళ్లం కలిసి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. మాకు ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేదు, అయినా మేము బాధపడటం లేదు. ఒక మంచి సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామనే గర్వం ఉంది. మా కంటెంట్ నచ్చి టీ-సిరీస్ లాంటి పెద్ద సంస్థ పాటల్ని, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఎలాంటి వల్గారిటీ లేని స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. అందరూ ఎంజాయ్ చేసే కామెడీ ఇందులో ఉంటుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హీరో సన్నీ మాదాల మాట్లాడుతూ.. “ఈ సినిమాకు వచ్చే క్రెడిట్ అంతా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీకర్ కృష్ణకే దక్కాలి. ఈ చిత్రానికి సంబంధించిన టార్చర్ ఏదైనా ఉంటే ఆయనే తీసుకున్నారు, ప్రేమను మాత్రం మాకు పంచారు! మా టెక్నీషియన్స్ అంతా సినిమాకు పెద్ద బలంగా నిలిచారు. తొలి చిత్రమైనా మౌనిక ఎంతో కాన్ఫిడెంట్‌గా నటించింది. నా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా పూర్తి చేశాను. ప్రతి ఒక్కరినీ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది” అన్నాడు. హీరోయిన్ మౌనిక వీర్ తన జర్నీని గుర్తుచేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయింది. “ఇందులో నేను ‘మానస’ అనే పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి వేదికపై నిల్చొని మాట్లాడే అవకాశం రావడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఈ సినిమాతో ఎంతోమంది మంచి స్నేహితులు దొరికారు. టీమ్ మొత్తాన్ని శ్రీకర్ కృష్ణ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది” అని చెప్పింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధార్థ్ వర్మ, విష్ణు ప్రియ, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొత్తవాళ్ల ప్రయత్నానికి అగ్ర సంస్థల తోడ్పాటు తోడవడంతో, డిసెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న ‘ఓ టార్చర్ ప్రేమ’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read
- Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ - కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
- Natural Star Nani: యాక్షన్‌కు నాని గుడ్‌బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
- December 2026 Movie Releases: డిసెంబర్లో సినిమా జాతర.. ఏకంగా 15 మూవీస్ రిలీజ్.. పూర్తి లిస్ట్ ఇదే..
- Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
తాజావార్తలు
-
O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?
-
Hyderabad: ఇంటి గేటు వద్ద కార్తీక దీపం.. చీరకు మంటలు అంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!
-
HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
-
Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ – కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
-
RBI New ATM Rules 2026: ATM నుంచి డబ్బులు తీసేవారికి RBI కొత్త రూల్స్.. యూజర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
ట్రెండింగ్
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!