O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల వివక్ష కొనసాగుతోందని ‘ఓ అందాల రాక్షసి’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులకు థియేటర్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని.. తమని తొక్కిపెడితే ఊరుకోమన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షిరాజ్ మెహదీ మాట్లాడుతూ.. చిన్న సినిమాల సమస్యలను, థియేటర్ల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.
‘అందరి సహకారంతో, మంచి సాంకేతిక నిపుణులతో ఓ అందాల రాక్షసి చిత్రాన్ని రూపొందించాము. మా సినిమాను సరైన స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తే రికార్డులు సృష్టించే సత్తా ఉంది. చిన్న సినిమాలకు థియేటర్లు దక్కకపోవడంపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్ మీట్లు, 50 ఇంటర్వ్యూలు ఇచ్చాను. సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. క్యూబ్, యుఎఫ్ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్లు వారానికి సుమారు రూ.2,000 ఖర్చుతో పూర్తయ్యే పనులకు ఒక్కో థియేటర్ నుంచి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల చిన్న నిర్మాతలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు’ అని హీరో షిరాజ్ మెహదీ చెప్పారు.
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చిన్న నిర్మాతలు, దర్శకులకు అండగా నిలవడం లేదని షిరాజ్ మెహదీ విమర్శించారు. చిన్న చిత్రాల సమస్యలను పరిష్కరించాల్సిన వ్యవస్థే తమపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపించారు. ఐనాక్స్, పీవీఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు తొలుత తమ సినిమాకు థియేటర్లు ఇస్తామని చెప్పి.. చివర్లో వెనక్కి తగ్గాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన నోటీసులు ఇచ్చామని, హైకోర్టు నుంచి సమన్లు కూడా వెళ్లాయని తెలిపారు. సినిమా పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమాలకు తగిన రక్షణ కల్పించడంతో పాటు.. సినీ పరిశ్రమపై ఆధారపడే డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ వంటి చర్యలు తీసుకోవాలని హీరో కోరారు.
తాజావార్తలు
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేసారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!