నుస్రత్ బరూచా… ఇంకా సౌత్ లో అంతగా తెలియని బాలీవుడ్ బ్యూటీ. టాప్ లీడింగ్ లేడీస్ లిస్టులోకి ఇంకా చేరలేదు. అయితే, తనదైన స్థాయిలో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉంది. క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కేస్తోంది బబ్లీ బరూచా!
2020 ఇండస్ట్రీలోని చాలా మంది సక్సెస్ ఫుల్ బ్యూటీస్ కి ఖాళీగానే గడిచిపోయింది. కానీ, నుస్రత్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘అజీబ్ దాస్తాన్స్’తో మంచి విజయం ఖాతాలో వేసుకుంది. పర్ఫామెన్స్ కి స్కొప్ ఉన్న క్యారెక్టర్ తో యాంథాలజీ సిరీస్ లో సత్తా చాటింది. అయితే, ఇంకా థియేటర్లు తెరుచుకోక చాలా మంది బాలీవుడ్ సెలబ్స్ ఇంట్లో కూర్చుని ఉన్న 2021లోనూ నుస్రత్ బేబీ దూకుడు తగ్గించటం లేదు. ఈసారి యూట్యూబ్ లో దుమారం రేపింది. పాప్ సింగర్ హనీ సింగ్ తో కలసి పాప తొలి సింగిల్ జనంలోకి వదిలింది! ‘సయ్యా జీ’ పాటతో తన సయ్యాటలు చూపి మాయ చేసింది…
నుస్రత్ బరూచా, హనీ సింగ్ కాంబినేషన్ లో గతంలోనూ కొన్ని హిట్ సాంగ్స్ వచ్చాయి. కానీ, అవన్నీ సినిమాల్లోని పాటలు. ఈసారి నుస్రత్ వీడియో సాంగ్ లో తళుక్కుమంది. హనీ సింగ్ తో కలసి ‘సయ్యా జీ’ అంటూ సరసాలు ఆడింది. యూట్యూబ్ లో ఏకంగా 400 మిలియన్లు దాటిపోయింది వ్యూస్ సంఖ్య! ఈ సందర్భంగా నుస్రత్ బరూచా తన ఆనందాన్ని వ్యక్తాన్ని చేసింది. సినిమాల కంటే సింగిల్స్ చాలా భిన్నమని అభిప్రాయపడింది. వీడియో ఆల్బమ్ సాంగ్స్ కి షూట్ చేయటం గొప్ప అనుభూతి అంటోంది.
ఇప్పుడిప్పుడే డిమాండ్ పెంచుకుంటోన్న నుస్రత్ బరూచా ‘చోరీ, హర్దంగ్, జన్ హిత్ మే జారీ, రామ్ సేతు’ లాంటి ఇంట్రస్టింగ్ మూవీస్ చేస్తోంది. చూడాలి మరి, రానున్న రోజుల్లో ఈ టాలెంటెడ్ బ్యూటీ ఎలాంటి రేంజ్ కి ఎదుగుతుందో!