యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్‌టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఎన్టీఆర్30లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు విన్పించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీనే మేకర్స్ చివరకు ఓకే చేశారట. ఎన్‌టిఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘ఎన్టీఆర్30’ హీరోయిన్ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ తెలుగులో కొరటాల శివ తెరకెక్కించిన ‘భరత్ ఆనే నేను’ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తరువాత కియారా తెలుగు చిత్రాలకు సంతకం చేయలేదు. కానీ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం కియారా రెండు భారీ బడ్జెట్ తెలుగు మూవీలలో హీరోయిన్ గా నటించటానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై క్లారిటీ లేదు.