Ntr Health University Row: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ప్రస్తుతం సినీ, రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరును ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ‘వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ’గా మారుస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పుపై బాలకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మార్చెయ్యడానికి, తీసెయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని హీరో బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఓ సంస్క్కతి, ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక అని గుర్తు చేసారు బాలకృష్ణ. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారని, కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ మండిపడ్డారు.
#NBK via Facebook page 🔥🔥
Thaggedhi ledhu asalu 🤙#RetainNTRname #NandamuriBalakrishna pic.twitter.com/sOsxbjrIKT
— manabalayya.com🌟 (@manabalayya) September 24, 2022
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై గతంలో జూ. ఎన్టీఆర్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశాడు. “ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరును పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
— Jr NTR (@tarak9999) September 22, 2022
సెప్టెంబర్ 21న (2022) జరిగిన ఏపీ అసెంబ్లీలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం లభించింది. ఇక యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. అయితే.. దీనిపై చర్చించి ఆమోదం తెలిపారు. కాగా, ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ :
ఎన్టీఆర్ అంటే తనకు ఎలాంటి కోపం లేదు అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్టీఆర్ మీద తనకు ఆప్యాయతే ఉందని, ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమం తన తరపున ఏనాడూ జరగదు అన్నారు. అంతేకాకుండా.. ఏ రోజు ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనలేదని గుర్తుచేశారు. పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.