యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో లార్డ్ మురుగన్ నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, ఎన్టీఆర్‌తో కలిసి మురుగన్ ఆధారిత చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత నాగ వంశీ అధికారికంగా ధృవీకరించగా, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని టాక్. ఈ సినిమా ప్రేరణగా ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన ‘లార్డ్ మురుగన్’ పుస్తకం నిలిచిందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ చేతిలో కూడా ఆ పుస్తకాన్ని చూశాం.
Also Read : The Paradise : నేచురల్ స్టార్ నాని ‘ది పారడైజ్’ షూటింగ్ అప్ డేట్..!
అయితే మరో ఆసక్తికర మలుపు ఏంటీ అంటే.. మలయాళ నటి మంజిమా మోహన్ కూడా అదే పుస్తకాన్ని చదువుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లార్డ్ మురుగన్’ పుస్తకం తో ఉన్న ఫోటోను షేర్ చేయగా, అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే మురుగన్ భగవానుడికి ఉన్న ఇద్దరు భార్యలలో ఒకరు దేవసేన (ఇంద్రుని కుమార్తె), మరొకరు వల్లి (గిరిజన యువతి). అయితే మంజిమ మోహన్ ఈ పాత్రలలో ఒకదానిలో నటించబోతున్నారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక ఎన్టీఆర్‌తో మంజిమ స్క్రీన్ షేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. వీరిద్దరు 2019లో విడుదలైన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ లో నారా భువనేశ్వరి పాత్రలో ఆమె నటించారు. ఇక నిర్మాతలు ఇంకా అధికారికంగా ఆమె పేరును ప్రకటించలేదు. దీంతో ఇది కేవలం ఊహాగానమే అయినా, నిజమేనైతే.. ఆమె కెరీర్‌కూ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.