ఆగస్ట్ 13న నెటిజన్స్ ముందుకొస్తోంది ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ లాంటి నటీనటులతో రూపొందిన భారీ బడ్జెట్ మూవీలో అనేక యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అయితే, ‘భుజ్’ మూవీలో నోరా ఫతేహి కూడా ఉండటం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈసారి కేవలం తన బెల్లీ డ్యాన్స్ లతో, ఐటెం సాంగ్ తో సరిపెట్టబోవటం లేదట మొరాకో మోనాలిసా!
Read Also : ప్లాన్ మార్చిన “ఖిలాడీ”
‘దిల్ బర్, సాకీ సాకీ’ లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకున్న నోరా నెక్ట్స్ యాక్టింగ్ పై మనసు పెట్టింది. ‘భుజ్’ మూవీలో ఆమె ఇండియన్ సీక్రెట్ స్పైగా నటిస్తోంది. పాకిస్తాన్ లో పని చేసే రా ఏజెంట్ గా ఆమెది కథలో కీలక పాత్ర. అయితే, గూఢచారి అవతారం ఎత్తేందు కోసం మిస్ ఫతేహి ప్రత్యేక శ్రద్ధ పెట్టి కఠినమైన శిక్షణ పొందిందట! రైఫిల్ ట్రైనింగ్ లో కొన్ని రోజుల పాటూ నిపుణుల పర్యవేక్షణలో గడిపింది నోరా. అంతే కాదు, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుందట సెక్సీ బ్యూటీ!
‘భుజ్’ సినిమా విడుదల తరువాత నోరా క్యారెక్టర్ పెద్ద హైలైట్ గా నిలుస్తుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. చూడాలి మరి, ‘మనోహరి’ తన డ్యాన్స్ తోనే కాక నటనతోనూ ఈసారి మన మనసులు ఎలా హరిస్తుందో!