దావూద్ ఇబ్రహీం డ్రగ్ సిండికేట్ కేసులో తన పేరును లాగడంపై నోరా ఫతేహి అసహనం వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు ఇటీవల భారీ డ్రగ్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి, అలాగే అండర్వర్ల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు రిమాండ్ కాపీలో కనిపించాయి. ఈ కేసు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా హై ప్రొఫైల్ పార్టీల నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చింది. రిపోర్టుల ప్రకారం, ఈ మొత్తం రాకెట్‌ను మొహమ్మద్ సలీం మొహమ్మద్ సుహైల్ షేక్ (అలియాస్ లావిష్) నడిపేవాడని పోలీసులు పేర్కొన్నారు. అతను భారత్ మరియు దుబాయ్‌లో జరిగే డ్రగ్ పార్టీలకు ప్రముఖులను ఆహ్వానించేవాడని, అలాంటి పార్టీలకు సినీ నటులు, మోడల్స్, రాపర్లు, చిత్రనిర్మాతలు, రాజకీయ నాయకుల వారసులు, ఇంకా దావూద్ బంధువులు కూడా హాజరయ్యేవారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అందరి వాంగ్మూలాలను రికార్డు చేయడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ సిద్ధమవుతోంది.
Also Read : Kajol & Twinkle : మేమిద్దరం ఓకే హీరోతో డేట్ చేశాం.. స్టార్ హీరోయిన్స్ బోల్డ్ కామెంట్స్
ఈ వివాదం పెద్దది అవుతుండగా, మొదటగా స్పందించిన వారిలో నోరా ఫతేహి ఒకరు. తనను ఈ కేసుతో అనవసరంగా లింక్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నోరా ఇలా రాశారు.. “నేను పార్టీలకు వెళ్లను నా పనిలోనే బిజీగా ఉంటాను. నాకు వ్యక్తిగత జీవితం కూడా లేదు. అలాంటి వారితో నేను ఎప్పుడూ మింగిల్ అవ్వలేదు అవ్వను కూడా. దుబాయ్‌కి వెళితే నా హైస్కూల్ ఫ్రెండ్స్‌తో గడుపుతాను. కావాలనే నా పేరుని ఇందులోకి లాగుతున్నారు. కానీ ఈసారి అలా జరగనివ్వను. నాపై తప్పుడు ఆలోచనలు చేస్తే భారీ ధర చెల్లించాల్సి వస్తుంది” అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది. అయితే నోరా గతంలో కూడా ఇటువంటి ఫేక్ న్యూస్‌తో తనను దెబ్బతీయడానికి ప్రయత్నించారని, కానీ అవి ఫలించలేదని చెప్పారు. తనకు సంబంధం లేని పార్టీలకు, కార్యకలాపాలకు తన పేరు వాడోద్దు అని కఠినంగా హెచ్చరించింది. కాగా ప్రజంట్ ఈ కేసు ఇప్పుడు బిగ్ స్టార్స్ వరకూ వెళ్లడంతో బాలీవుడ్‌లో గందరగోళం మొదలైంది.