Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizam Exhibitors: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై, ముఖ్యంగా పలువురు నిర్మాతలు చేసిన ఘాటు వ్యాఖ్యలపై తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా తీవ్ర స్థాయిలో స్పందించింది. నగరంలో డిస్ట్రిబ్యూటర్లు, ప్రధాన ఎగ్జిబిటర్లు అంతా కలిసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మీడియా సమావేశం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్లు పలు కీలక విషయాలపై కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ‘పెద్ది’ సినిమా వివాదాన్ని తమకు ఆపాదించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమా ఇష్యూతో తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా కొందరు నిర్మాతలు తమపై పర్సనల్ విమర్శలకు దిగడం ఏమాత్రం సబబు కాదని వారు హితవు పలికారు. ఇలాంటి ఆరోపణలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణంలో.. ‘పర్సంటేజ్ విధానం’ అమలు కోసం తాము దశాబ్దన్నర కాలంగా (2008 నుంచి) నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. తమ డిమాండ్లు న్యాయమైనవని, ఎగ్జిబిటర్లు బాగుంటేనే సినిమా బతుకుతుందని అన్నారు. అయితే, తాము ఎప్పుడూ ఘర్షణ వాతావరణాన్ని కోరుకోలేదని.. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడు చర్చలకు ఆహ్వానించినా తాము సిద్ధంగానే ఉన్నామని, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని వారు క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, వ్యాపార లావాదేవీలకు సంబంధించి తలెత్తిన విభేదాలకు ముగింపు పలికేందుకు రంగం సిద్ధమైంది. రేపు ఫిలిం ఛాంబర్ వేదికగా ఒక అత్యంత కీలకమైన భేటీ జరగనుంది. ఈ మీటింగ్‌లో ఎగ్జిబిటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమ భవిష్యత్ కార్యాచరణపై ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, పరిశ్రమలోని అన్ని వర్గాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా, నిర్మాతలకు కూడా నష్టం జరగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. మరి రేపటి ఛాంబర్ మీటింగ్‌లో ఎగ్జిబిటర్లు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారోనని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!