Mysaa Movie: రష్మిక.. ‘మైసా’ టైటిల్ అంటే అర్థం ఏంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ ఎవరు? అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ ఇలా బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆమె తాజాగా నటించబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా (Mysaa)’ . కాగా ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం, ముక్కుపుడకతో ఆమె లుక్ చూసిన అంతా షాక్ అయ్యారు. ‘ధైర్యం ఆమె బలం..ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి..’ అంటూ ఇచ్చిన హైప్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక..‘మైసా’ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే అందరిలోనూ ఓ ఆసక్తి నెలకొంది. అసలు మైసా అంటే ఏంటి?
Also Read : Nayanthara : పెళ్లి ఓ పొరపాటు.. నయనతార షాకింగ్ పోస్ట్
Also Read
రష్మిక లుక్‌కు ఈ పేరుకు సంబంధం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. అయితే ‘మైసా’ అనే పదం వివిధ భాషల మూలాల నుంచి తీసుకున్నారు. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో ‘మైసా’ అనే పదానికి ‘తల్లి’ (Mother) అని అర్థం. స్వేచ్ఛా భావాలతో, సహజ నాయకత్వంలో ముందుకు సాగిన ఓ సాహసవంతురాలి పాత్రకు ఇది సరైన టైటిల్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక వారియర్ మదర్ కనిపించనున్నారు. గోండు తెగల పటిష్ఠమైన సామాజిక నేపథ్యం ఆధారంగా ఈ కథ సాగనుంది. ఈ తెగల హక్కుల కోసం పోరాడే ఓ తల్లిగా, నాయకురాలిగా రష్మిక పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఆమె పాత్రలో ఉన్న తీవ్రత, ఎమోషన్‌ను ఫస్ట్ లుక్ స్పష్టంగా అర్ధమవుతుంది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!