టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం యువతి శివానీతో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచిన నితిన్, తాజాగా తన పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నార్నే నితిన్-శివానీల నిశ్చితార్థ వేడుక గత ఏడాది నవంబర్ 3న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, హీరో కల్యాణ్ రామ్, వెంకటేష్, రానా దగ్గుబాటి, హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత చినబాబు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తదితరులు హాజరై నూతన జంటకు ఆశీర్వాదాలు అందించారు.
Also Read :WAR -2 : వార్ -2 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తన కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి వేడుకలో సందడి చేశారు. కాగా, నితిన్ నిశ్చితార్థం చేసుకున్న శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. నార్నే నితిన్, శివానీల నిశ్చితార్థం ఘనంగా జరిగిన తర్వాత, వీరి పెళ్లి ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వీరి వివాహ ముహూర్తం అక్టోబర్ 10న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పనులు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుంది.