Nilakanta: ఆసక్తికరంగా “నీలకంఠ” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nilakanta పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా “నీలకంఠ”. ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “నీలకంఠ” సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Zepto, Blinkit, Flipkartలకు షాక్.. సమ్మె చేయనున్న గిగ్ వర్కర్స్..!
Also Read
ఈ కార్యక్రమంలో హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ – నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. ఇందులో మంచి ఫైట్స్, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ “నీలకంఠ” సినిమాతో నాకు ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!