Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ వైడ్‌గా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ఈ సినిమాతో టాలీవుడ్లో మరో విజువల్ వండర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పరంగా టాలీవుడ్లో ఒక నయా రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు అధికారికంగా వెల్లడించింది.
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ సినిమాలో నివేదా థామస్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఒక లెజెండరీ వారియర్ (యోధుడు) కథగా వస్తున్న ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉండబోతున్నాయని, అందుకోసం భారీ ఎత్తున సీజీ (CG) వర్క్ జరుగుతోందని తాజా అప్డేట్ ద్వారా స్పష్టమైంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాల తర్వాత అత్యధిక గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న చిత్రాల జాబితాలో ‘స్వయంభూ’ కూడా చేరిపోయింది. అంతే కాదు ఈ సినిమాలో ఏకంగా 2,700కు పైగా VFX (గ్రాఫిక్స్) షాట్స్ ఉండబోతున్నాయి. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో గ్రాఫిక్స్ ప్లాన్ చేయడం టాలీవుడ్లో ఇదే మొదటిసారి అని చెప్పాలి. కాగా హాలీవుడ్ రేంజ్ ఔట్‌పుట్‌ను స్క్రీన్‌పై ప్రెసెంట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ టాప్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలకు చెందిన దాదాపు 750 మందికి పైగా సీజీ ఆర్టిస్టులు రాత్రింబవళ్లు షిఫ్టుల వారీగా నాన్-స్టాప్‌గా శ్రమిస్తున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
యుద్ధ సన్నివేశాలు, పురాతన సామ్రాజ్యాల సెట్స్, నిఖిల్ వారియర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని మేకర్స్ హామి ఇస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి యుద్ధ విద్యలలో కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. రవి బస్రూర్ (KGF ఫేమ్) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ ఏడాది చివర్లో ఈ విజువల్ ఎపిక్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నిఖిల్ 'స్వయంభూ' నయా రికార్డ్!
జోరుగా ‘స్వయంభూ’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు!
విజువల్ వండర్‌గా రాబోతున్న నిఖిల్ పీరియడ్ యాక్షన్ డ్రామా
ఏకంగా 2700 VFX (గ్రాఫిక్స్) షాట్స్‌తో నయా రికార్డ్!
రాత్రింబవళ్లు నాన్-స్టాప్‌గా శ్రమిస్తున్న 750 మంది సీజీ ఆర్టిస్టులు
హాలీవుడ్ రేంజ్ ఔట్… pic.twitter.com/aiAMbcFIvu
— NTV Breaking News (@NTVJustIn) May 23, 2026
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..