NTV Telugu Site icon

Niharika: నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా.. మెగా డాటర్ నిహారిక పోస్ట్ వైరల్..

Niharika

Niharika

Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వెబ్ సిరీస్ లలో ఎక్కువగా కనిపిస్తోంది. అదే టైమ్ లో ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. విడాకుల తర్వాత ఆమె సొంతంగానే ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ సొంత ఇమేజ్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లోనే నిహారిక చేస్తు్న్న పోస్టులు చర్చలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: Off The Record : నిలకడలేని రాజకీయం ఆ ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీని పక్కన పడేసిందా..?

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బర్త్ డే సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను నిహారిక ఇన్ స్టాలో పోస్టు చేసింది. నా పార్ట్ టైమ్ అమ్మ, ఫుల్ టైమ్ అక్క, అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. రీసెంట్ గానే ఆమె మద్రాస్ కారన్ సినిమాలో నటించింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు ఇటు వెబ్ సిరీస్ లలో కూడా నిహారిక యాక్ట్ చేస్తూనే నిర్మిస్తోంది. వీటితో పాటే పెద్ద సినిమాల్లో ఏదైనా పాత్రల్లో అవకాశం వచ్చినా నటించేందుకు సిద్ధం అవుతోంది.