ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనం నిధి అగర్వాల్ పర్యటనకు వినియోగించారంటూ మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక లేఖను ఆమె విడుదల చేశారు. తాను ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్లానని, అక్కడ తన కారు గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఈవెంట్‌కి హాజరైన సమయంలో అక్కడి లోకల్ ఆర్గనైజర్లే తనకు ట్రాన్స్‌పోర్టేషన్ కల్పించారని చెప్పుకొచ్చింది.
Also Read:Bigg Boss 9: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’.. తట్టుకుంటారా ?
అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వాహనం అయి ఉండవచ్చు, కానీ నేను ఆ వాహనం నాకు ప్రొవైడ్ చేయమని అడగలేదు. అక్కడి ఈవెంట్ ఆర్గనైజర్లే నాకు ఆ వాహనాన్ని సమకూర్చడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఆ వాహనాన్ని పంపించారని కొన్ని పోర్టల్స్‌లో నేను చదివాను. నేను ఆ విషయాన్ని చాలా క్లియర్‌గా ఖండిస్తున్నాను. ఈ ఆరోపణలన్నీ నిజం కావు, నిరాధారమైనవి. ఏ ప్రభుత్వ అధికారికి ఈ విషయంతో సంబంధం లేదు. నేను నా అభిమానులకు అసలు నిజం చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ విషయాన్ని క్లారిఫై చేస్తున్నాను. నాకు నా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, సపోర్ట్‌కి నేనెప్పుడూ కృతజ్ఞురాలిని అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
