ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఆయన ఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.
Keeravani: ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కీరవాణి రాసిన పాట..విన్నారా?
అల్లు అర్జున్ వల్లే నిండు ప్రాణం బలైంది ఒక సినిమా వల్ల ఒకరి ప్రాణం పోయిందని, ఇంకో పసి ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని, పోలీసులు రావద్దు అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం కారణంగా ఒక నిండు ప్రాణం బలైందని యుగంధర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కేసుని విచారణకు స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. తాజాగా తెలంగాణ డీజీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసి నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు దిగినట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ ఘటనపై వివరణ కోరింది మానవ హక్కుల కమిషన్.