ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కేజీఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
Also Read : “పుష్ప” కోసం రష్మిక మందన్న భారీ ప్లాన్…!?
కానీ దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను సెప్టెంబర్ 9న విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక వినాయక చవితికి ‘కేజీఎఫ్-2’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టించడం ఖాయం. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.