Site icon NTV Telugu

Ustaad Bhagat Singh OTT Rights: ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ హక్కులు ఫిక్స్..

Pawan

Pawan

Ustaad Bhagat Singh OTT Rights: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండటం మూవీపై మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. ఈ సినిమా అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు నుంచే బిజినెస్ పరంగా స్ట్రాంగ్ డీల్‌ చేసుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ తాజాగా ఓటీటీ హక్కులపై బిగ్ అప్‌డేట్‌ ఇచ్చింది.

Read Also: Snapdragon 8 Gen 5, 200MP కెమెరా, 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo లాంచ్.. ధర ఎంతంటే..?

అయితే, థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ తాజాగా పండుగ సీజన్ సందర్భంగా తెలుగు సినిమాల లిస్ట్ ను ప్రకటించగా, ఆ లిస్ట్‌లో మొదటి సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ పేరు నిలిచింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా సంక్రాంతి పండుగ లాంటి వార్త అని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా పవన్ మాస్ ఇమేజ్ మరింత విస్తరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్

ఇక, సినిమా విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ చూడని లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, హరీష్ శంకర్ మార్క్ మాస్ ట్రీట్ ఇందులో హైలెట్ గా నిలవనుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేయగా, ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్‌ వచ్చింది. మొత్తంగా చూస్తే, థియేటర్లలో భారీ ఓపెనింగ్స్‌తో రచ్చ చేయడానికి ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ అవుతుంది. విడుదల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను అలరించనుందని స్పష్టం చేసింది. పవర్ స్టార్ మాస్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను కూడా షేక్ చేస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు.

Exit mobile version