Nehal Vadoliya: ప్రాణాలకి ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ వర్మ చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని వివాదం ముసురుకుంది. ఆయన నుంచి, ఆయన పీఆర్ (PR) టీమ్ నుంచి తనకు నిరంతరం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నటి నేహాల్ వడోలియా చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారాయి. తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆమె చేసిన ఆవేదన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను నేహాల్ బహిర్గతం చేశారు. “నేను ఏ పాడ్క్యాస్ట్కి వెళ్లి మాట్లాడినా నా గొంతు నొక్కేస్తున్నారు, ఈ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. విజయ్ వర్మ స్వయంగా నాకు కాల్ చేసి బెదిరిస్తున్నాడు, లేదా అతని పీఆర్ టీమ్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు” అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ వరుస పరిణామాలతో తాను తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లు ఆమె తెలిపారు.
ఇండస్ట్రీలోని ఈ వాతావరణం, ఈ బెదిరింపుల కారణంగా గత నాలుగున్నరేళ్లుగా తాను ఎలాంటి ప్రాజెక్టులు చేయలేదని, కెరీర్‌కు పూర్తిగా దూరంగా ఉన్నానని నేహాల్ వెల్లడించారు. “ఇలాంటి దారుణమైన వాతావరణంలో నేను బతకలేను. నా చుట్టూ మనుషులను కాకుండా కుక్కలు, ఆవులు వంటి జంతువులను ఉంచమని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.. ఈ మనుషుల కంటే అవే ఎంతో నయం” అంటూ మనుషులపై తనకున్న విరక్తిని అత్యంత ఆవేదనగా బయటపెట్టారు. ఇకపై ఎవరినీ కలిసే ఉద్దేశం తనకు లేదని, ఒంటరిగా ఉండిపోవాలనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ తీవ్రమైన ఆరోపణలు ఇంటర్నెట్ను కుదిపేస్తున్నాయి. దీనికి మరింత బలం చేకూర్చేలా ఆమె షేర్ చేసిన వీడియో కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేహాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై విజయ్ వర్మ కానీ, ఆయన టీమ్ కానీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
తాజావార్తలు
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!