Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwambhara vs Kaaka: మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు వస్తుండటంతో అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. అసలు ఈ చర్చ అంతా ‘విశ్వంభర’ (Vishwambhara), ‘కాకా’ (Kaaka) రిలీజ్ డేట్స్ పైనే. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాల రిలీజ్ డేట్ లపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ముందే ఆఫీషియల్ గా ప్రకటించారు. అయితే భారీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల వల్ల ఆలస్యమవుతూ వస్తున్న ఈ సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ను కూడా దసరా రేస్ నుండి తప్పించి, 2027 జనవరి 9న సంక్రాంతి బరిలోకి దించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే హీరో నటించిన రెండు భారీ సినిమాలు విడుదల కావడం సాధ్యం కాదు కాబట్టి, ఒక సినిమా రేసు నుండి తప్పుకోక తప్పదు అన్నట్లు సాగుతోంది ఈ వ్యవహారం.
‘విశ్వంభర’ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా భారీ VFX ఆధారంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ కావడంతో దీనికి సోలో రిలీజ్ విండో అవసరమనే అభిప్రాయం కూడా ఉంది. అదే సమయంలో ‘కాకా’కు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వస్తుందని చిత్రబృందం భావిస్తోంది. బాబీ, చిరంజీవి కాంబినేషన్‌కు ‘వాల్తేరు వీరయ్య’ విజయంతో ఇప్పటికే మంచి సెంటిమెంట్ ఉండటంతో సంక్రాంతి సీజన్‌ను వదులుకోవడానికి మేకర్స్ అంత సులభంగా అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం ‘కాకా’ విడుదలను సంక్రాంతి రేసులో నిలిపి, ‘విశ్వంభర’ ను 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసేలా కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం చిరంజీవి చేతుల్లోకి వెళ్ళినట్లు, ఆయన తీసుకునే నిర్ణయంతో రిలీజ్ డేట్స్ ను మేకర్స్ కన్ఫార్మ్ చేయబోతున్నట్లు కూడా ఫిల్మ్ నగర్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
ప్రస్తుత పరిస్థితిని చూస్తే ‘’విశ్వంభర’ను సమ్మర్‌కు వాయిదా వేస్తున్నారనే వార్తలకు కూడా ఇప్పటివరకు బలం లేదు. జనవరి 13, 2027నే ‘కాకా’ రిలీజ్ డేట్‌గా అయితే కొనసాగుతోంది. ‘విశ్వంభర’కు మాత్రం సమ్మర్ 2027 అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే చివరగా మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాల రిలీజ్ విషయంలో చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ‘విశ్వంభర’కు ఎప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
- Tags
- cinema
- Kaaka
- Vishwambhara
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి