NTV Telugu Site icon

NBK50Years : నందమూరి బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల అతిధుల లిస్ట్ ఇదే..

Untitled Design

Untitled Design

నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసే అతిధులు ఎవరెవరు అంటేతమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి, కన్నడ స్టార్ శివన్న, విజయ్ సేతుపతి, అక్కినేని నాగార్జున‌, విక్టరీ వెంక‌టేష్‌, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మాచో స్టార్ గోపీచంద్‌, అక్కినేని అఖిల్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, స్టార్ బాయ్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్‌, శ్రీ‌విష్ణు, నాగశౌర్య‌, అల్ల‌రి న‌రేష్‌, శివకార్తీకేయన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు, బాలయ్య సరసన నటించిన హీరోయిన్స్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. టాలీవుడ్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా అతిరధ మహారథుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ మహా వేడుకకు హైదరాబాద్ లోని నోవాటెల్ హైటెక్స్ హోటల్ లో సెప్టెంబరు 1న సాయంత్రం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.

Show comments