NTV Telugu Site icon

Nayanthara : నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ అనేది ఉండదు

Nayantara

Nayantara

టాలీవుడ్ లోని చాలా మంది స్క్రీన్ పై లుక్ కరెక్ట్ గా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేపించుకోవడం మాములే. గతంలో ఎందరో నటీమణులు తమ శరీరంలో ఎదో ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వారే. ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్​ ప్లాస్టిక్​ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వార్తలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోని వీటిపై వివిధ రకాల వార్తలు రావడంతో ఒక్కొక్కరు స్పందిస్తున్నారు.

Also Read : LuckyBaskhar : త్రివిక్రమ్ – సునీల్ రూ. 30ల కథ..

తాజాగా హీరోయిన్ నయనతార కూడా ఈ విషయంపై స్పందించింది. తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను ఈ ముద్దుగుమ్మ ఖండించింది. తాను అసలు తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని,ఆ అటువంటి అవసరం తనకు లేదని ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై నయనతార మాట్లాడింది. కానీ నాకు “నా కను బొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటి ఆకారాన్ని ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ఏదైనా భారీ ఈవెంట్లకు వెళ్లేముందు లుక్స్ కోసం ఎంతో సమయం కేటాయించి వాటిని మార్చుతాను. అలా వాటినిమార్చినప్పుడల్లా నా పేస్ లో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ఫేస్​లో మార్పులు వచ్చాయని అంటారేమో. అలాగే ఫిట్ నెస్ కోసం చేసే డైటింగ్‌ వల్ల కూడా ఫేస్ లో చేంజెస్ రావచ్చు. డైట్ లో ఉన్నపుడూ బుగ్గలు లావుగా, మరోసారి చిన్నగా అనిపిస్తాయి. మీరు కూడా కావాలంటే మీరు గిచ్చి కూడా చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ అనేది ఉండదు” అని నయనతార చెప్పుకొచ్చింది.

Show comments