Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన స్టామినాను నిరూపించుకునేందుకు నయనతార ప్రయత్నిస్తోందా? ‘టాక్సిక్’, ‘హాయ్’ సినిమాలతో వరుసగా ఆశించిన ఫలితాలు రాకపోవడం కాస్త నయన సక్సెస్ ట్రాక్ ని డల్ చేశాయి. ఇలాంటి సమయంలో అమ్మవారి పాత్రలో మరోసారి ‘మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా? లేక వరస పరాజయాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ ఆమెను వెంటాడుతుందా? నయనతారకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కొత్తేమి కాదు. గతంలో ‘మూకుతి అమ్మన్’లో అమ్మవారి పాత్రలో మెప్పించిన ఆమె ఇప్పుడు అదే ఫ్రాంచైజీ సీక్వెల్ లో వస్తుంది. ఈసారి ‘మూకుతి అమ్మన్ 2’ ను ‘మహాశక్తి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగానికి భిన్నంగా డివైన్ ఫ్యాంటసీ, యాక్షన్, భారీ విఎఫ్ఎక్స్ తో ఉండబోతుంది.
‘టాక్సిక్’లో నయనతార గంగ పాత్రలో యష్ కి అక్కగా కనిపించింది. పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని ముందే హైప్ వచ్చిన సినిమా రిలీజ్ తర్వాత అంచనాలు పూర్తిగా నిలబడలేదు. ‘టాక్సిక్’ తర్వాత కవిన్ తో కలిసి ‘హాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన. రొమాంటిక్, కామెడీ, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో నయనతార, కవిన్ కెమిస్ట్రీ కి మంచి మార్కులే పడ్డాయి. కానీ రొటీన్ కథ, దీంతో మరోసారి నయనతారకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ బూస్ట్ రాకపోవడం, వెంటవెంటనే రెండు ఫ్లాప్స్ రావడం ఇప్పుడు ‘మహాశక్తి’పై అంచనాలతో పాటు ప్రెజర్ ను కూడా పెంచుతుంది. ‘మహాశక్తి’లో నయనతారను మరోసారి పవర్ఫుల్ దైవిక అవతారంలో చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. రెజీనా విలన్ గా కనిపించడం, దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశీ లాంటి నటులు ఉండడం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే టీజర్ విజువల్స్ హైప్ తెచ్చినా, కథ, విఎఫ్ఎక్స్ క్వాలిటీనే సినిమా ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తాయి. ‘టాక్సిక్’, ‘హాయ్’ తర్వాత ‘మహాశక్తి’తో నయనతార సక్సెస్ ట్రాక్ లోకి తిరిగి వస్తుందా? లేక హ్యాట్రిక్ ఫ్లాప్ ఆమె ఖాతాలో చేరుతుందా అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- 418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే 'పాన్-ఇండియా' రేంజ్‌కు మారిన '418' రిలీజ్!
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
తాజావార్తలు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?