Nani: మరో సీక్వెల్ లో న్యాచురల్ స్టార్ నాని..దర్శకుడు ఎవరంటే..?
- ప్రస్తతం దసరా -2లో నటించనున్న నాని
- వాల్ పోస్టర్ బ్యానర్ లో వరుసగా సినిమాలు
- ప్రశాంత్ వర్మ- శైలేష్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. దసరా, హాయ్ నాన్న వంటి హిట్లు నానిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి. నానితో దసరా వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆ చిత్రానికి సెక్వెల్ గా దసరా -2ను మొదలు పెట్టాడు ఈ హీరో. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం.
మరో వైవు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఇతర హీరోలతో సినిమాలు నిర్మించడమే కాకుండా పలువురు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు నేచురల్ స్టార్. తొలి ప్రయత్నంలోనే ‘ఆ’ అనే చిత్రంతో ప్రశాంత్ వర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. రెండవ చిత్రంగా హిట్ అనే ఫ్రాంచైజ్ ను తెరకెక్కించాడు. హిట్ తో శైలేష్ కొలను అనే మరో నూతన దర్శకుడిని పరిచయం చేసాడు. ఆ ఫ్రాంచైజ్ లో మొదటి రెండు భాగాలు విడుదలై సూపర్ హిట్ సాధించాయి. ఇప్పుడు హిట్ -3ని పట్టాలెక్కించేందుకు సన్నాహకాలు ప్రారంభించారు దర్శకుడు మరియు నిర్మాత. మొదటి రెండు భాగాలలో విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించారు. ఇప్పుడు హిట్-3లో హీరోగా అర్జున్ సర్కార్ అనే పాత్రలో నాని నటించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర షూటింగ్ ను ఆగస్టులో ప్రారంభించనున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రన్ని కంప్లీట్ చేసి దసరా -2మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు నాని. హిట్-3 లో కథానాయికగా కె.జి.ఎఫ్ సిరీస్ లో మెరిసిన శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదే విధంగా తాను నిర్మాతగా హాస్య నటుడు ప్రియదర్శి హీరోగా ఓ చిత్రాన్ని నిరించనున్నట్టు ప్రకటించాడు నిర్మాత కమ్ హీరో నాని.
Also Read
Also Read: Tollywood : మైథలాజీకల్ కథల పై టాలీవుడ్ దర్శకుల మోజు..!
తాజావార్తలు
-
IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
-
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
-
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
-
Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
-
UPI Payment New Rules: UPI చెల్లింపు న్యూ రూల్స్.. ఈ రోజు నుండి డబ్బు పంపే విధానంలో మార్పులు
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!