బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వయసు రీత్యా కలిగిన అనారోగ్య కారణాలతో మరోసారి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ సీనియర్ నటుడు అనారోగ్యం పాలవ్వటం ఆందోళనకరం. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆసుపత్రి పాలయ్యారు. జూన్ 29న న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనకు హాస్పిటల్ లో చేర్పించారు.
Read Also : స్టార్ హీరోతో మూవీ… హింట్ ఇచ్చేసిన రష్మిక
ఈ విషయం గురించి ఆయన మేనేజర్ మాట్లాడుతూ “నసీరుద్దీన్ షా ఆరోగ్యం బాగానే ఉంది. ఆయనకు ఊపిరితిత్తులలో చిన్న ప్యాచ్ ఉంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇంతకుముందు ఒకసారి నషీరుద్దీన్ షా అనారోగ్యం పాలయ్యారని వార్తలు షికార్లు చేయగా… ఆయన కుమారుడు తన తండ్రి బాగున్నారని వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ నటుడు చివరిసారిగా వివేక్ అగ్నిహోత్రి నటించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘రాంప్రసాద్ కి తెహర్వి’, జీ5 ‘మీ రక్సం’ చిత్రాలలో నటించారు.