ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు లైన్‌లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ లిస్టులో జాయిన్ అయింది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా రూపొందుతోంది. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్యతో పాటు సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read:Samyuktha: ఎలా ఉండే సంయుక్త.. ఎలా అయిపోయింది?
అయితే, దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయడమే కాక, సంక్రాంతి 2026కి సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, శర్వానంద్‌కి గతంలో సంక్రాంతికి వచ్చి ‘శతమానం భవతి’తో మంచి హిట్టు అందుకున్నాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ మరోసారి సంక్రాంతికి సినిమాను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉండడంతో, ఈ సినిమా రిలీజ్ చేస్తారా లేక చివరి నిమిషంలో వాయిదా పడుతుందా అనే విషయం మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. వాస్తవానికి, ఈ సినిమా షూట్ పలు కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తూ ఉండడం గమనార్హం.