Site icon NTV Telugu

Nara Rohit : నాలుగు రోజల పాటు నారా వారి పెళ్లి వేడుకలు

Nara Rohit Marrriage

Nara Rohit Marrriage

హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు తాజాగా ఖరారయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది. అనంతరం, అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించనున్నారు.

Also Read : Kantara: Chapter 1: ఇండియాలో ఫస్ట్ మూవీగా కాంతార రికార్డు

అక్టోబర్ 28న కుటుంబ సభ్యులు, ఆత్మీయ స్నేహితుల సమక్షంలో మెహందీ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరగనుంది. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి ముహూర్తాన్ని అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో నిశ్చయించారు. సినీ తారలు, ప్రముఖుల రాకతో ఈ మొత్తం వేడుకలు సంతోషాల నడుమ ఒక మెమరబుల్ ఈవెంట్‌గా జరగనున్నాయి.

Exit mobile version