Kantara: Chapter 1: ఇండియాలో ఫస్ట్ మూవీగా కాంతార రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, తెలుగులో 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
Also Read:Bison : ‘బైసన్’ పై అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ రియాక్షన్..
Also Read
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ఇప్పుడు, ‘కాంతార: చాప్టర్ 1’ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ ఇంగ్లీష్ వెర్షన్ కోసం చిత్ర బృందం రన్ టైం తగ్గించినట్లు సమాచారం. ఈ వెర్షన్ 2 గంటలు, 45 నిమిషాలు, 40 సెకన్ల నిడివితో ఉండనుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార’కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’, ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద తన సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!