Nani : జనసేనకు మద్దతుగా ముందుకొచ్చిన టాలీవుడ్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం.ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు .గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా సపోర్ట్ చేయలేదు .ఈ సారి టాలీవుడ్ లో చాల మంది సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు .ఈసారి జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది.ఈ సారి తెలుగు దేశం,బీజేపీలతో కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది .
ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో ఎలాగైనా గెలిపించుకోవాలని టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కు సపోర్ట్ గా నిలిచింది..సాయి తేజ్ ,వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్ ఇప్పటికే పిఠాపురం లో జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు .తాజాగా మెగా స్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ను గెలిపించాల్సిందిగా ఓ వీడియో ను రిలీజ్ చేసారు .ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .అలాగే టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని పవన్ కు తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు.ప్రియమైన పవన్ కల్యాణ్ గారు మీరు అతి పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొనబోతున్నారు .మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని ఆశిస్తున్నాను .నేను మీకోసం మద్దతుగా నిలుస్తున్నాను ..ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేసారు .ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది .
Also Read
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼
— Nani (@NameisNani) May 7, 2024
- Tags
- AP Elections
- Nani
- pawan kalyan
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?