ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో జిమ్ సర్బ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే కంప్లైంట్స్ వస్తున్నా సరే, సినిమా అదిరిపోయిందని చూసినవారందరూ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయి.
Also Read:Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!
ఆ సంగతి పక్కన పెడితే, ఇలాంటి హిట్ తర్వాత శేఖర్ ఎవరితో సినిమా చేస్తాడని అందరూ భావిస్తున్న తరుణంలో, ఆయన తర్వాతి సినిమా హీరో నానితో ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే నానికి శేఖర్ కమ్ముల లైన్ చెప్పాడని, లైన్ బాగా నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తోంది. పూర్తి కథ సిద్ధం చేసుకోమని, సిద్ధమైన తర్వాత ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు సర్దుబాటు చేయడానికి తాను సిద్ధమని నాని చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read:Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !
నాని ప్రస్తుతానికి ది పారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సుజిత్ దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా వివేక్ ఆత్రేయతో మరో సినిమా, హాయ్ నాన్న దర్శకుడితో మరో సినిమా కూడా చేస్తాడని అంచనాలు ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా సరే, శేఖర్ కమ్ముల సినిమా ఫైనల్ అయితే కచ్చితంగా ఆయనకు డేట్స్ ఇస్తానని నాని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి, ఎందుకంటే శేఖర్ కమ్ముల సాధారణంగా ఒక కథ రాసుకోవడానికి దాదాపు సంవత్సరం పైగానే సమయం తీసుకుంటాడు కాబట్టి, ఇప్పట్లో ఆ సినిమా ఉండే అవకాశం అయితే లేదు.
