నేచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని తన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన విషయమే. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి ఘన విజయం సాధించింది. దసరా భారీ విజయం కావడంతో నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ పెద్ద ప్రాజెక్ట్ రానుందని ప్రకటించారు. రెండో సారి వీరి కాంబోలో రానున్న సినిమా పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Sharwa38 : శర్వానంద్ – సంపత్ నంది పాన్ ఇండియా కథ ఇదే..
ఈ సినిమా కోసం దర్శకుడు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆ పోస్టులో దర్శకుడు ‘మార్చి 7, 2023 – నా మొదటి సినిమా దసరాకి నేను చెప్పిన చివరి కట్, షాట్ ఓకే. మళ్లీ తిరిగి #NaniOdela2 అనౌన్స్‌మెంట్ వీడియో కోసం “యాక్షన్” అని సెప్టెంబర్ 18, 2024 న ప్రకటించాను. ఈ అనౌన్స్ మెంట్ 4 కోట్ల 84 లక్షల 400 సెకండ్లు పట్టింది. ప్రతి సెకను నా తదుపరి ప్రాజెక్ట్ కోసం అత్యంత చిత్తశుద్ధితో పని చేస్తున్నాను. #NaniOdela2తో దసరా సినిమాకి వచ్చిన హైప్ ను 100 రెట్లు సృష్టిస్తానని మాట ఇస్తున్నాను’ అని శ్రీకాంత్ ఓదెల అన్నారు.
నాని ఈ చిత్రంపై స్పందిస్తూ.. ” This one’s madness is back in my life. Be prepared to be blown away ” అని ట్వీట్ చేసాడు. దీన్ని బట్టి చుస్తే నాని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారని.. కథ ఉత్కంఠభరితంగా సాగుతుందని అర్ధం అవుతోంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు, నాని, శ్రీకాంత్ ఓదెల కు ఈ సినిమా మరింత ప్రత్యకం కానుంది