Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandi Awards: తెలుగు సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అత్యున్నత పురస్కారాలు ‘నంది అవార్డులు’. దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర రారాజులైన నంది విగ్రహాలు ప్రభుత్వ లాకర్లకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వీటికి మోక్షం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. 2017 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న కాలానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే. సాధారణంగా నంది అవార్డులంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, విలన్, హాస్యనటుడు, సంగీతం, కెమెరా సహా పదుల సంఖ్యలో కేటగిరీలు ఉంటాయి. కానీ 2017 నుంచి 2024 వరకు ఎనిమిదేళ్ల గ్యాప్‌లో విడుదలైన సినిమాలకు ఈ కేటగిరీలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం సాంకేతికంగా, ఆచరణాత్మకంగా అసాధ్యమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అందుకే ఆ మధ్యంతర సంవత్సరాలకు ఏటా కేవలం నాలుగు అవార్డులు (ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, మరో రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు) మాత్రమే ప్రదానం చేయనున్నట్లు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్ స్పష్టం చేశారు. దీంతో ఆ ఏడేళ్ల కాలంలో అద్భుత ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత నందులు దక్కే అవకాశం లేకుండా పోయినట్లయింది. పరిశ్రమ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారింది.
అదే సమయంలో 2012 నుంచి 2016 మధ్య కాలానికి సంబంధించి అప్పట్లో ప్రకటించి ఆగిపోయిన 288 సినీ, 51 జ్యూరీ అవార్డులతో పాటు టెలివిజన్ రంగానికి చెందిన 330 పురస్కారాలను బాకీ లేకుండా అందజేస్తామని సర్కార్ భరోసా ఇచ్చింది. ఇక 2025 నుంచి ఎలాంటి కోతలు లేకుండా ఎప్పటిలాగే అన్ని విభాగాల్లోనూ పూర్తిస్థాయి నంది అవార్డులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డుల’తో దీనికి ఎలాంటి ముడిపెట్టడం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అక్కడ సత్కారం పొందిన తెలుగు చిత్రాలు సైతం ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చని, తెలుగు కళామతల్లికి ప్రాంతీయ భేదాలు లేవని తేల్చేశారు. అంతేకాకుండా, ఈసారి నగదు ప్రోత్సాహకాన్ని కూడా ప్రత్యేక జీవో ద్వారా పెంచబోతున్నట్లు తెలిపారు. సినిమా నంది అవార్డుల ప్రధానోత్సవం రాజధాని అమరావతి వేదికగా, టెలివిజన్ నంది అవార్డుల వేడుక ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో జరగనుందని వెల్లడించారు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
- Kayadu : ఆయనొక వింత మనిషి!": 'ది ప్యారడైజ్' దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
తాజావార్తలు
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!