Site icon NTV Telugu

NBK 111: గోపీచంద్‌తో సినిమా ఆరోజే మొదలు

Akhanda 2

Akhanda 2

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. అఖండ తాండవం పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ కావడంతో, ఆ తర్వాత జోష్‌తో మరిన్ని సినిమాలు చేశారు. ఇక బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో సరికొత్త జోష్ నిండిపోతుంది. దానికి తోడు, ఆ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమా అవుట్‌పుట్ గురించి ఒక రేంజ్‌లో మాట్లాడుతుండడంతో, కచ్చితంగా సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read : Akhil: స్ట్రైక్ ఎఫెక్ట్.. లెనిన్ మరింత ఆలస్యం

ఆ సంగతి పక్కన పెడితే, బాలకృష్ణ తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని తో ఉండబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని దసరా నాడు, అంటే అక్టోబర్ రెండవ తేదీన లాంచ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బాలకృష్ణ ఒక్కరే సినిమాలో అయ్యారు, మిగతా నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట్ సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మరోసారి తమన్ బాలకృష్ణకు సంగీతం అందించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version