బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 9 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే అదరగొడుతున్నారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీగా మరికొందరు హౌస్ లో అడుగుపెట్టారు. సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి వివిధ సినిమా సెలెబ్రిటీస్ కూడా అడుగుపెట్టి కంటెస్టెంట్స్ తో సరదాగా ముచ్చటిస్తున్నారు.
Also Read : Narendra Modi : మెగా పవర్ స్టార్ దంపతులకు ప్రధాని మోడీ స్పెషల్ విషెష్..
తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెట్స్ కు తమిళ యంగ్ సెన్సేషన్ డ్యూడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ రంగనాథ్, ప్రేమలు బ్యూటీ మమిత బైజు, తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ఈ షో లో సందడి చేశారు. ఆ సందర్భంగా నటుడు ప్రదీప్ రంగనాధ్ ను పొగడ్తలతో ముంచెత్తారు నాగార్జున. ప్రదీప్ నుద్దేశిస్తూ ‘ కొన్ని దశాబ్దాల క్రితం గ్లామర్ తో సంబంధం లేకుండా ఒక మెరుపుతీగ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ స్టార్ గా మారాడు ఆయనే రజనీకాంత్. ఆ తర్వాత బక్కగా ఉండే ఓ కుర్రాడు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారి శెభాష్ అనిపించుకున్నాడు అతడే ధనుష్. ఇక ఇప్పుడు ఈ జనరేషన్ లో డైరెక్టర్ గా అడుగుపెట్టి నటుడుగా సూపర్ బ్లాక్ బస్టర్స్ అందుకుని హీరో అవ్వాలంటే గ్లామర్ తో పని లేదు టాలెంట్ ఉంటె చాలు అని నిరూపించావ్ ప్రదీప్ నువ్వు రియల్ హీరోవి’ అని అన్నారు. మీ నుండి ఇంతటి కంప్లిమెంట్ తీసుకోవడం నా అదృష్టం అని నాగార్జున వ్యాఖ్యలకు బదులు ఇచ్చాడు ప్రదీప్ రంగనాథ్