Nagarjuna : పాన్ ఇండియా చిత్రాల పై నాగార్జున కామెంట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ ముంబైలో ‘వేవ్స్’ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో భాగంగా అగ్ర నటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా చిత్రలపై.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నాగార్జున మాట్లాడుతూ.. ‘ నేటితరం ప్రేక్షకులు హీరోలను లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారు, బాహుబలి, పుష్పరాజ్.. రాఖీ (కేజీఎఫ్) సినిమాల భారీ విజయానికి అదే కారణం. ఇలాంటి కథలను మనం ఇంతకు ముందు చూశాం. కానీ ఉత్తరాది ప్రేక్షకులు కూడా పుష్పరాజ్, యశ్ లాంటి హీరోల్ని అక్కడి సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారు. వారందరికీ కావాల్సిందే ఇలాంటి హీరోలు. రోజువారీ జీవితంలో ఎంతో ఒత్తిడిలు ఎదురుకుంటున్న ప్రజలు సినిమాలు చూసి ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకుంటారు. అలాంటి ప్రేక్షకులకు మనం తెరపై మాయాజాలం చూపించాలి. భారతీయ సినిమాలు కథ, కథనాల విషయంలో ప్రాంతీయతను కోల్పోకుండా చిత్రాల్ని రూపొందిస్తున్నాయి. అవి స్థానిక కథల నుంచి దూరంగా వెళ్లడం లేదు. అందుకే భారతీయ సినిమాలు విజయవంతమయ్యాయి. దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’లోని ప్రతీ సీన్లో తెలుగుతనం ఉట్టిపడేలా తీశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దీన్ని ఇష్టపడ్డారు. మీరు మీ మాతృభాష పై దృష్టి పెట్టి, కథ చెబితే అది కచ్చితంగా ప్రేక్షకులకు దగ్గరవుతారు’ అంటూ తెలిపాడు.
Also Read
- Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
- Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్‌లో బయటపెట్టిన విశాల్
- Salman Khan: గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
- Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
- Tags
- kushboo
- nagarjuna
- WAVES Summit
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!