డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఊర్వశి కాంబినేషన్లో వచ్చిన దబిడి దిబిడే సాంగ్ స్టెప్స్ గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. తాజాగా ఇదే విషయం గురించి ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురయింది. సాంగ్లో స్టెప్స్ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్ట్ ఆ లేక నిర్మాత నాగవంశీ ఇంట్రెస్ట్ ఆ అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి నాగ వంశీ స్పందిస్తూ ఏమండీ ఊర్వశిని కొట్టింది నేనా అని ప్రశ్నించారు. అయితే దానికి బాలయ్యను ఊహించుకుని మీరు కొట్టి ఉంటారు అంటూ సదరు రిపోర్టర్ పేర్కొనడంతో నేను కొడితే అయినా నా ఇంట్రెస్ట్ అంటే ఒక అర్థం ఉంది.
Pushpa 2: పుష్ప 2 రీ లోడెడ్.. మరో 20 నిముషాలు యాడింగ్
బాలకృష్ణ గారు కొడితే మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి అని ప్రశ్నించారు. అయితే నిర్మాతగా ఒక మంచి మాస్ సాంగ్ ఇవ్వాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా అని అడిగితే అవును ఇచ్చాను కదా, మాస్ సాంగ్ ఇవ్వాలని ఉంటుంది కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలి అనేది నేను డిసైడ్ చేస్తానా? అని నాగ వంశీ ప్రశ్నించారు. అయితే మీ ఇంట్రెస్ట్ ఏమీ లేదా అని అడిగితే నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఏముంటుంది ఇక్కడ అంటూ ఆయన కామెంట్ చేశారు. అంటే పూర్తిగా ఇది కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన డాన్స్ మూవ్మెంట్స్ తప్ప తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని నాగవంశీ తేల్చి చెప్పినట్లయింది.